News April 1, 2025

MHBD: ఘిబ్లీ ట్రెండ్.. వైరల్ అవుతున్న అనంతాద్రి దేవాలయం

image

మహబూబాబాద్ జిల్లాలో నెట్టింట వైరల్ అవుతున్న ఘిబ్లీ ఆర్ట్‌ను అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలు ఆదరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అనంతాద్రి ఆలయ చిత్రం ఇప్పుడు ఘిబ్లీ ఆర్ట్‌తో మహబూబాబాద్‌లో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ప్రజలకు చూపించేందుకు Way2News ప్రత్యేక చిత్రాన్ని తీసుకువచ్చింది. ఫొటో ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News October 27, 2025

HYD: ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య ఆ మార్గాల్లో పెంచాలని డిమాండ్

image

అంతర్రాష్ట్ర బస్సులు ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు మార్గాల్లో ఎక్కువగా నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, ముంబై, పూణే మార్గాల్లో కూడా రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల వైపు అనేక మంది ప్రయాణికులు మొగ్గు చూపుతుండగా.. వాటి సంఖ్యను ఆయా మార్గాల్లో పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.

News October 27, 2025

కరీంనగర్: దారుణం.. ‘బాలికల బాత్రూంలో కెమెరాలు’

image

గంగాధర మండలం కురిక్యాల జడ్పీ హైస్కూల్‌లో కీచక అటెండర్ అరాచకాలు బయటపడ్డాయి. బాలికల మూత్రశాలలో గోప్యంగా కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద పరికరాన్ని గుర్తించిన బాలికలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు పాఠశాల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

News October 27, 2025

అన్నదాత సుఖీభవ.. ఆ రైతులకు గుడ్ న్యూస్

image

AP: వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల వల్ల ‘అన్నదాత సుఖీభవ’ పథకం 5.44L మంది రైతులకు ఆగిపోయింది. వీటిలో ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 ఛార్జ్ ఉంది. అయితే పథకం ఆగిపోయిన అన్నదాతలంతా ఒకసారి ఉచితంగా సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకోసం మీసేవా ఛార్జీలు రూ.2.72 కోట్లను మాఫీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
* రోజూ రైతులకు సంబంధించిన సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.