News April 16, 2025
MHBD: చిన్నారిపై కత్తితో కాల్చి వాతపెట్టిన అంగన్వాడి ఆయా

మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని అంగన్ వాడీ కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న మణిదీప్(5)పై అంగన్వాడి ఆయా కత్తితో కాల్చి వాత పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా దాష్టికంపై సీడీపీవోకు చిన్నారి తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఘటన జరిగి 4 రోజులు అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ సెంటర్ ముందు బాధితుడి బంధుమిత్రులు ఆందోళనకు దిగారు.
Similar News
News December 4, 2025
KNR: అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు.. జోరుగా ప్రచారం

స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇప్పటివరకు గుర్తులు లేకుండా ఓట్లు అడిగిన అభ్యర్థులు, ఇప్పుడు తమ గుర్తులతో ప్రచారంలోకి దిగి వేగం పెంచారు. ఇలా గుర్తులు కేటాయించారో లేరో అలా సోషల్ మీడియాలో తమతమ గుర్తులతో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.
News December 4, 2025
HNK: కోతులు, కుక్కల బెడదపై ప్రత్యేక ఫోకస్..

హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో కోతులు, కుక్కల బెడదను అరికడితేనే మీకు సపోర్ట్ చేస్తామని ప్రజలు చెప్తూ ఉండడంతో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఈ అంశంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. నేరెళ్ల గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ అభ్యర్థులు చింపాంజీ, ఎలుగుబంటి వేషధారణలతో విన్నూత్న ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
News December 4, 2025
SRPT: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న ప్రారంభం కానుంది. సమయం దగ్గర పడుతుండడంతో బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. తిరుమలగిరి(M) వెలిశాలలో కాంగ్రెస్ బలపర్చిన మంజుల సతీష్ గౌడ్ ప్రచారం చేస్తున్నారు.


