News April 10, 2025
MHBD: ‘జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను ముందంజలో ఉంచాలి’

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను ముందంజలో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి రవి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.బి రవి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడారు.
Similar News
News November 12, 2025
పాలమూరు అగ్రో డైరెక్టర్ రమేష్ రెడ్డి అరెస్ట్

పాలమూరు అగ్రో కాంప్లెక్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.రమేష్ రెడ్డిని ఎస్ఎఫ్ఐఓ అధికారులు అరెస్టు చేశారు. ప్రమోటర్లకు తెలియకుండా నకిలీ పత్రాలతో సంస్థకు చెందిన రూ.300 కోట్ల విలువైన 100 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టు వారెంట్ జారీ చేయడంతో, ఆయన్ను అధికారులు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు.
News November 12, 2025
NGKL: ‘దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలి’

దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు కృషి చేయాలని నోడల్ అధికారి నీతూ కుమారి ప్రసాద్ అన్నారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News November 12, 2025
ఏలూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

వివేకా ఎక్స్ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి సుదీప్ బోరో (30) మృతి చెందాడు. మాల్దా జిల్లాకు చెందిన ఇతను చెంగనూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోకి రాగానే ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం స్టేషన్ మాస్టర్ సమాచారంతో రైల్వే హెచ్సీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


