News March 11, 2025

MHBD: జాబ్ మేళా సద్వినియోగపర్చుకోండి: రజిత

image

MHBD జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 12న వైఎస్‌కే ఇన్ఫోటెక్ రంగారెడ్డి, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి టి రజిత ఒక ప్రకటనలో తెలిపారు. 18-28 ఏళ్లు నిండి ఉండి పదవ తరగతి విద్యార్హతతో ఆసక్తి కలిగిన స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని రజిత పేర్కొన్నారు. 

Similar News

News December 5, 2025

సంగారెడ్డి డీపీవో సాయిబాబా సస్పెండ్‌

image

సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు.

News December 5, 2025

సీఎం స్టాలిన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

image

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాలిన్‌తో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.

News December 5, 2025

SVU: పరీక్ష ఫలితాలు విడుదల.!

image

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc 3, 4 M.A హిస్టరీ, సోషల్ వర్క్, హ్యూమన్ రైట్స్ ఉమెన్ స్టడీస్ మొదటి సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం (SVU DDE) ఆధ్వర్యంలో B.LI.Sc పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.