News March 11, 2025

MHBD: జాబ్ మేళా సద్వినియోగపర్చుకోండి: రజిత

image

MHBD జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 12న వైఎస్‌కే ఇన్ఫోటెక్ రంగారెడ్డి, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి టి రజిత ఒక ప్రకటనలో తెలిపారు. 18-28 ఏళ్లు నిండి ఉండి పదవ తరగతి విద్యార్హతతో ఆసక్తి కలిగిన స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని రజిత పేర్కొన్నారు. 

Similar News

News February 8, 2026

MNCL: తండ్రుల కోసం తనయుల ఆరాటం!

image

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, BRS మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుల తనయులు మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. తండ్రులకు అండగా ఉంటూ ఎమ్మెల్యే PSR తనయుడు చరణ్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు విజిత్ రావు తమ పార్టీ అభ్యర్థుల గెలుపును భుజస్కందాలపై వేసుకొని ఇంటింటా ప్రచారాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండవచ్చు.

News February 8, 2026

ఏలూరు: వాషింగ్ మిషన్‌లో దూరిన నాగుపాము

image

జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ సమీపంలోని చిన్నం సుబ్బారావు నివాసంలో ఆదివారం వాషింగ్ మిషన్‌లో నాగుపాము కలకలం రేపింది. బట్టలు వేసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు బుసలు వినిపించడంతో పరిశీలించగా పాము కనిపించింది. వెంటనే స్నేక్ సేవియర్ సొసైటీకి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

News February 8, 2026

NLG: గల్లంతైన వ్యక్తి కోసం NDRF గాలింపు!

image

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో కారు పడి గల్లంతైన పుల్లయ్య కోసం NDRF బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. నిన్న జరిగిన ప్రమాదంలో భార్య పద్మ మృతదేహం లభించగా, భర్త జాడ తెలియక పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ఘటనను ప్రమాదమా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అతడిని విచారిస్తున్నారు.