News March 15, 2025

MHBD జిల్లా అమ్మాయికి వరుస ఉద్యోగాలు

image

మహబూబాబాద్ పట్టణానికి చెందిన డోలి సంధ్య గ్రూప్-3లో 269.9 మార్కులతో 1,125 ర్యాంకు సాధించింది. జోనల్ స్థాయిలో బీసీ-ఏ మహిళా విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. ఇప్పటికే గ్రూప్-4 లో ఉన్నత ర్యాంకు సాధించిన సంధ్య మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తుంది. అదే విధంగా ఈ నెల 11న విడుదలైన గ్రూప్‌-2 ఫలితాల్లో సంధ్య 382.4 మార్కులతో 205 ర్యాంకు సాధించింది.

Similar News

News December 2, 2025

పాలకొల్లు: ఏ తల్లికీ ఇలాంటి కష్టం రాకూడదు.!

image

పాలకొల్లులో కొడుకు చితికి తల్లి నిప్పు పెట్టిన విషాదకర ఘటన చోటుకుంది. బంగారువారి చెరువు గట్టుకు చెందిన సత్యవాణి కుమారుడు శ్రీనివాస్ తో కలిసి ఉంటోంది. భార్యతో విడాకులు తీసుకొన్న శ్రీనివాస్ మద్యానికి బానిసై అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయిన వాళ్లు లేకపోవడంతో తల్లి కైలాస రథంపై హిందూ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన చూపరులను కలచివేసింది.

News December 2, 2025

మెదక్: సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ వైరల్

image

పంచాయతీ పోరులో ఓ సర్పంచ్ అభ్యర్థి తన ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్‌పై రాసిచ్చిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హవేలిఘనపూర్ మం. రాజిపేటతండాకు చెందిన ఓ అభ్యర్థి తానును ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.2వేలు, అన్ని కులాల పండుగలకు రూ.20వేలు సహా ఇతర హామీలతో బాండ్ పేపర్ రాసిచ్చారు. ఈ హామీలు అమలు చేయకుంటే పదవీ నుంచి తొలగించాలంటూ పేర్కొన్నారు. కాగా ఈ బాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

News December 2, 2025

అన్నవరం ఆలయానికి ఆరో స్థానం

image

ఐవీఆర్‌ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానానికి 6వ స్థానం దక్కింది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వం సర్వే చేసింది. అందులో అన్నవరం ఆలయం 69.7% తో ఆరో స్థానం దక్కించుకుంది. ప్రసాదానికి 77.6% బాగుందని వచ్చింది. శానిటేషన్ విషయంలో 64.2 శాతం మంది మాత్రమే నిర్వహణ బాగుందన్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు ఈ సర్వే జరిగింది. మరి మన అన్నవరం ఆలయ నిర్వహణపై మీ కామెంట్.