News March 4, 2025
MHBD జిల్లా కేంద్రంలో రేపు ఎంపీ బలరాం

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ మంగళవారం జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంటారని ఆయన PRO ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే మూడవ లైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి నేరుగా MPని సంప్రదించవచ్చని కార్యాలయ వర్గాలు ప్రకటించారు.
Similar News
News March 19, 2025
పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎంపీ వద్దిరాజు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సరదాగా ముచ్చటించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుల వివాహ వేడుకకు హాజరై వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎంపీలు రవిచంద్ర, మస్తాన్ రావులు, ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు హాజరై పుష్పగుచ్చం అందజేసి అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
News March 19, 2025
ADB: ఉపాధి పని ప్రదేశంలో వాటర్ బెల్

వేసవిలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనులు చేసేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఓను ఆదేశించినట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో రక్షణ కల్పించేందుకు ఉపాధి పథకంలో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పనులకు హాజరయ్యే కూలీలకు గంటకోసారి నీళ్ళు తాగేలా పని ప్రదేశంలో చర్యలు తీసుకోవాలన్నారు.
News March 19, 2025
CC కెమెరాలకు ప్రజల సహకారం అవసరం: KMR ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల సహకారం అత్యవసరమని KMR జిల్లా SP రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్‌ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహన చోదకులకు CC ఫుటేజీల ద్వారా చలాన్ విధిస్తామని పేర్కొన్నారు.