News February 28, 2025
MHBD జిల్లా రైతుకు జాతీయ అవార్డు

మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామశివారు మేగ్యాతండాకు చెందిన మిరపరైతు బోడ వీరన్నకు గురువారం జాతీయ ఉత్తమ రైతు అవార్డును ఢిల్లీలో కేంద్ర మంత్రి శోభఖరేండ్లజే అందజేశారు. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ వారు అభివృద్ధి చేసిన అర్కతేజస్వి రకం మిరపరను వీరన్న తన వ్యవసాయభూమిలో సాగుచేసి ఎకరాకు 30 క్వింటాల దిగుబడి సాధించారు. ఈసందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News November 28, 2025
MBNR: AHTU.. NOVలో 24 కార్యక్రమాలు: ఎస్పీ

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU)-2025 నవంబర్లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో మొత్తం 24 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళా భద్రత విభాగం హైదరాబాద్ ఆదేశాల మేరకు.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్పోల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఆపరేషన్ స్ట్రోమ్ మేకర్స్–3’ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
News November 28, 2025
గంగాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇల్లంతకుంట వాసి మృతి

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 28, 2025
MBNR: ‘టీ-పోల్’ యాప్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టీ-పోల్’ మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని వివరించారు.


