News March 10, 2025
MHBD: డోర్నకల్‌కు యంగ్ ఇండియా గురుకులం

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు చొప్పున పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గంలో ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
Similar News
News December 3, 2025
HYD: విలీనంతో భవిష్యత్ ప్రశ్నార్థకం..!

GHMCలో శివారు ప్రాంతాల విలీనానికి ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ విలీనంతో నేతలు, రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ స్థాయి నేతల భవిష్యత్ ప్రశ్నార్థకమైందని వాపోతున్నారు. ఎందుకీ విలీనం, భూములే లేనిచోట అభివృద్ధిపై వివరణ ఎక్కడని ORR పరిసరాల రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, స్ట్రీట్ లైట్లేలేని తమని ట్యాక్స్ కట్టడంలో బంజారాహిల్స్‌తో పోటీ పడమంటారా అని మేడ్చల్, RR ప్రజలు భగ్గుమంటున్నారు.
News December 3, 2025
చంటి పిల్లల్లో నీళ్ల విరేచనాలు అవుతున్నాయా?

ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని టాడ్లర్స్ డయేరియా అంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థాలు, తీపి తగ్గించడంతో పాటు జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అయినా తగ్గకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణం కావొచ్చు. దీనికి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
News December 3, 2025
నడింపాలెంలో రూ. 93.82 కోట్లతో CRIYN, 100 పడకల ఆసుపత్రి

ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 పడకల ఆసుపత్రి, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రాజ్యసభ వేదికగా ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.93.82 కోట్ల అంచనాతో ఈ నిర్మాణం ఉండబోతోందని చెప్పారు.


