News February 2, 2025

MHBD: తాగునీటి కొరత రాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్: కలెక్టర్

image

మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. IDOC కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ, నీటిపారుదల, సంబంధిత శాఖ అధికారులతో ఈ వేసవిలో తాగునీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బోర్ల పురోగతి పరిశీలించి, మంచినీటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.

Similar News

News February 7, 2025

‘తండేల్’ మూవీ పబ్లిక్ టాక్

image

చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా షోలు USలో మొదలయ్యాయి. తండేల్ రాజు, సత్య పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశ భక్తి అంశాలు, DSP మ్యూజిక్, పాటలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని, డైరెక్టర్ కాస్త ఫోకస్ చేస్తే బాగుండేదంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ

News February 7, 2025

పీఎం స్కూల్ కింద 30 పాఠశాలలు ఎంపిక: VKB కలెక్టర్

image

జిల్లాలో ప్రధాన మంత్రి స్కూల్స్ పర్ రైసింగ్ ఇండియా స్కీం కింద 30 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని 30 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంపికైన పాఠశాలల్లో కనీస సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

News February 7, 2025

నేడు వైసీపీలోకి శైలజానాథ్

image

మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ నేడు వైసీపీలో చేరనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన శింగనమల నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. కష్టసమయంలో వైసీపీ గూటికి చేరుతున్న ఆయనకు జగన్ ఎలాంటి బాధ్యత అప్పగిస్తారన్న విషయమై జిల్లాలో ఆసక్తి నెలకొంది.

error: Content is protected !!