News March 19, 2025
MHBD: దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సౌకర్యాలను దివ్యాంగులకు అందించాలని, జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం దివ్యాంగులకు ఉపకరణాలను అందించే కార్యక్రమంలో పాల్గొని, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆత్మ స్థైర్యం నింపారు. ఉచిత ఉపకరణాలను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఏడి రాజేశ్వరరావు, డీఎస్ఓ అప్పారావు, మోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
ఉమ్మడి నల్గొండలో పార్టీ బలోపేతంపై BJP ఫోకస్..!

తెలంగాణలో బీజేపీ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు జిల్లాల ఇన్ఛార్జ్లను కొత్తగా నియమించారు. జిల్లాల వారీగా నాయకత్వ మార్పులు చేసి, గ్రౌండ్లో కార్యకర్తలతో అనుసంధానం, పంచాయతీ ఎన్నికల వేళ దూకుడు పెంచాలని పార్టీ భావిస్తోంది. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా ఉదయ్ను నియమించగా, సూర్యాపేటకు టీ.రమేశ్, యాదాద్రి భువనగిరికి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారు.
News December 1, 2025
అధ్యక్షా.. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి!

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన నడికుడి – కాళహస్తి రైల్వే లైన్, ఎప్పటి నుండో వేచి ఉన్న గిద్దలూరు రైల్వే గేటు బ్రిడ్జి, ఇతర రైల్వే అభివృద్ధి పనులు, పొగాకు రైతుల సమస్యలపై, అల్లూరు వద్ద ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్ట్, పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. మరి MP ఏం ప్రస్తావిస్తారో చూడాల్సి ఉంది.
News December 1, 2025
BREAKING ప్రకాశం: క్రిస్మస్ ఏర్పాట్లు..ఇద్దరు మృతి.!

త్రిపురాంతకంలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కొత్త అన్నసముద్రంలో విద్యుత్ ఘాతానికి గురై ఎస్సీ కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందారు. పచ్చిలగొర్ల విజయ్ (40) వీర్నపాటి దేవయ్య (35) సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


