News March 15, 2025
MHBD: ధర్నాను జయప్రదం చేయాలి: కవిత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా శనివారం ఉదయం 10 గంటలకు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి భారాస జిల్లా అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు సకాలంలో చేరుకుని దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News October 17, 2025
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ నర్సింహా

నూతనంగా నిర్మిస్తున్న అనంతగిరి పోలీస్ స్టేషన్ను ఎస్పీ నర్సింహా శుక్రవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు నాణ్యంగా, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం స్టేషన్లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.
News October 17, 2025
మక్తల్: మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, సుందరీకరణ పనుల శంకుస్థాపనను మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వాకిటి శ్రీహరి సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు రూ.3.70 లక్షల నిధులతో సీడీఎంఏ ప్రత్యేక నిధుల కింద ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రులు తెలిపారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా చెరువు కట్టపై మొక్కలు నాటారు. పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News October 17, 2025
JNTUH విద్యార్థులకు ALERT

కూకట్పల్లిలోని JNTU 14వ స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. డిసెంబర్లో స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 2024- 25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి UG, PG, PHD పూర్తైన విద్యార్థులు డిగ్రీల కోసం నవంబర్ 30లోపు వర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు సూచించారు.