News March 15, 2025

MHBD: ధర్నాను జయప్రదం చేయాలి: కవిత

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా శనివారం ఉదయం 10 గంటలకు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి భారాస జిల్లా అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు సకాలంలో చేరుకుని దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News April 21, 2025

విజయనగరం పీజీఆర్ఎస్‌కు 205 వినతులు

image

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు 205 వినతులు అందాయి. కలెక్టర్ అంబేడ్క‌ర్, JC సేతు మాధవన్, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 205 అర్జీలు అందగా, భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 138 వినతులు అందాయి. జేసీ సమీక్షిస్తూ గడువు లోపలే వినతులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

News April 21, 2025

అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పిన రోహిత్

image

నిన్న CSKతో మ్యాచులో అర్ధసెంచరీతో ముంబైకి విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ఫొటోను షేర్ చేస్తూ భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పారు. దీనిని అభిషేక్ షేర్ చేస్తూ ‘నథింగ్ బట్ లవ్’ అంటూ రీపోస్ట్ చేశారు. కాగా ఈ IPL సీజన్‌లో తొలుత విఫలమైన రోహిత్ తిరిగి గాడిన పడటంలో అభిషేక్ పాత్ర ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

News April 21, 2025

SVU పరీక్షల వాయిదా

image

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించి అన్ని పరీక్షలను మే 12, 14వ తేదీ తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. 24వ తేదీ నుంచి మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

error: Content is protected !!