News February 15, 2025
MHBD: నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

2008 డీఎస్సీలో అర్హత సాధించిన ఎస్జీటీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు HNK డీఈవో కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు.ఉమ్మడి జిల్లాలో 295 మంది అభ్యర్థులకు గాను 182 మంది అభ్యర్థులు వెరిఫికేషన్కు హాజరయ్యారు. నేడు MHBD జిల్లాకు చెందిన 52 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. వీరికి నెలకు రూ.31,040 జీతం ఇవ్వనున్నారు.
Similar News
News November 26, 2025
అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలి: ఎస్పీ

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పౌర హక్కులు, కర్తవ్యాలు, రాజ్యాంగం విలువలు తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.
News November 26, 2025
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చనిపోయారా?

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ను చూసేందుకు రావల్పిండిలోని అడియాలా జైలుకు వచ్చిన ఆయన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జైలు బయట PTI మద్దతుదారులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. తమ సోదరుడిని చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై దాడి చేశారని, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్నారు.


