News January 31, 2025
MHBD: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 3,727 మంది విద్యార్థులను గాను రూ.21,81,390 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News November 23, 2025
పుత్తూరు: హత్య చేసిన నిందితుడి అరెస్ట్

పుత్తూరు మండలం గొల్లపల్లి వద్ద ఈనెల 19వ తేదీన హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టు తాలూకా కేశవరాజుకుప్పానికి చెందిన రవి(40)ని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వ్యసనాలకు బానిసైనా రవి రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు పరిసర ప్రాంతాలలో చెత్త, కాగితాలు ఏరుతూ ఉండేవాడు. తినడానికి డబ్బు ఇవ్వలేదని తన సంచిలోని కత్తి తీసి రామ్మూర్తిని పొడిచాడు.
News November 23, 2025
సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.
News November 23, 2025
సిరిసిల్ల: సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త: ఎస్పీ

పుట్టపర్తి సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సాయిరాం జయంతి సందర్భంగా సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిరాం పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు, ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


