News March 7, 2025
MHBD: పోలీస్ స్టేషన్‌లో దావత్.. ఇద్దరి సస్పెండ్

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌పైన విశ్రాంతి గదిలో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మద్యం తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు ఐజీ వెల్లడించారు.
Similar News
News April 16, 2026
కామారెడ్డి: తీవ్ర విషాదం.. హోంగార్డ్ మృతి

బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ వీరబత్తిని సురేష్(42) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విధి నిర్వహణలో నిబద్ధత గల సురేష్ అకాల మరణం పట్ల తోటి పోలీస్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పోలీసు శాఖకు తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News April 16, 2026
వనపర్తి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

పెబ్బేరులో ప్రేమ, పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన జుర్రు మహేశ్‌పై కేసు నమోదు అయింది. ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 2021సంవత్సరం నుంచి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పెబ్బేరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
News April 16, 2026
నేడు రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణం

MHBD జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన వేం నరేందర్ రెడ్డి గురువారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. TG నుంచి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ప్రమాణ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన నరేందర్ రెడ్డి ఎన్నికపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నారు.


