News March 7, 2025

MHBD: పోలీస్ స్టేషన్లో మందు పార్టీ

image

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మందు పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు గురువారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ విచారణ జరిపి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Similar News

News November 22, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

image

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

News November 22, 2025

ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

image

AP: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD తెలిపింది. ఇది సోమవారానికి వాయుగుండంగా మారి బుధవారానికి తుఫానుగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ప్రకాశం, NLR, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.

News November 22, 2025

ములుగు: టీఆర్‌పీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాలోని 10 మండలాలకు సోషల్ మీడియా కన్వీనర్లను ప్రకటించింది. ములుగుకు బుద్దే రాజు, వెంకటాపూర్- దుగ్గొని నిశాల్, గోవిందరావుపేట- సునావత్ మోహన్ రావు, ఏటూరునాగారం- గగ్గురీ రాంబాబు, వాజేడు- బొల్లె రమేష్, వెంకటాపురం- శ్రీరామ్ నాగ సునీల్, కన్నాయిగూడెం- భీముని నరేష్, మంగపేట- బండి సందీప్, మల్లంపల్లి- నూనె రాజ్ కుమార్‌లను నియమించినట్లు జిల్లా కన్వీనర్ తెలిపారు.