News March 7, 2025
MHBD: పోలీస్ స్టేషన్లో మందు పార్టీ..!

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మందు పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు గురువారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ విచారణ జరిపి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Similar News
News November 18, 2025
ఇవాళ్టి నుంచే అబుదాబి T10 లీగ్

ఇవాళ్టి నుంచి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా T10 లీగ్ ప్రారంభంకానుంది. 12 రోజులు జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్స్ 32 మ్యాచులు ఆడనున్నాయి. వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ సారథ్యంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. టీమ్ ఇండియా మాజీ స్టార్స్ హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా వంటివారు కూడా ఈ లీగ్లో భాగం కానున్నారు.

మహబూబాబాద్: తండ్రి కళ్ల ముందే కొడుకు ప్రాణం విలవిల..!

తన కళ్ల ముందే తన కొడుకు విలవిల కొట్టుకుంటూ చనిపోతుంటే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్(D) తొర్రూర్(M) పోలేపల్లికి చెందిన ధరావత్ వనిత, విశ్వనాథ్ దంపతుల కుమారుడు రామ్చరణ్(17). తమ పొలంలో వడ్లు తెచ్చేందుకు తండ్రి నడుపుతున్న ట్రాక్టర్పై కూర్చొని రామ్చరణ్ వెళ్లాడు. గట్టు ఎక్కిస్తున్న క్రమంలో ట్రాలీలో ఉన్న రామ్చరణ్ కింద పడగా అతడిపై నుంచి చక్రం వెళ్లడంతో చనిపోయాడు.