News March 7, 2025
MHBD: పోలీస్ స్టేషన్లో మందు పార్టీ..!

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు గురువారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ విచారణ జరిపి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Similar News
News March 7, 2026
జాగ్రత్త.. రేపు అన్ని జిల్లాల్లో 36°C-40°C

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 3°C-4°C డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో 36°C-40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 38°C-40°C మధ్య టెంపరేచర్ నమోదైందని తెలిపింది.
News March 7, 2026
ఏకీకృత కుటుంబ సర్వే మూడు రోజులలో పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న ఏకీకృత కుటుంబ సర్వేను మరో మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 7,55,812 కుటుంబాలకు ఇప్పటివరకు 6,51,697 కుటుంబాల సర్వే పూర్తయిందన్నారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News March 7, 2026
మానవపాడు: 1200 ఏళ్ల చరిత్ర.. అరుదైన విగ్రహాల గుర్తింపు

మానవపాడు మండలంలోని బోరవెల్లిలో అరుదైన చారిత్రక సంపదకు నిలయంగా నిలుస్తోందని, బాదామి చాళుక్యుల నుంచి నిజాం కాలం వరకు ఉన్న వివిధ రాజవంశాల ఆనవాళ్లను సోమవారం పరిశోధించి గుర్తించామని పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. 8వ శతాబ్దం బాదామి చాళుక్యుల కాలపు చండి, చాముండి విగ్రహాలని గుర్తించారు. 1200 ఏళ్ల వారసత్వాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు


