News April 8, 2025
MHBD: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానం

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహాబూబాబాద్
జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఎం.నరసింహస్వామి నేడు ఒకప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024-25వ సంత్సరానికి గాను జిల్లాలో చదువుతున్న(SC/ST/BC/OC/EBC) విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు మార్చి చివరిలోపు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News July 8, 2025
మహబూబాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్

కాచిగూడ నుంచి మహబూబాబాద్, డోర్నకల్ మీదుగా తిరుపతి వెళ్లడానికి స్పెషల్ ట్రైన్ నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే ఎస్టీఎం రాజనర్సు తెలిపారు. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ స్పెషల్ ట్రైన్ జులై 10, 17, 24, 31 తేదీల్లో నడుపుతున్నామని ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News July 8, 2025
బాధితులకు సత్వర న్యాయం జరగాలి: SP అశోక్ కుమార్

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా SP అశోక్ కుమార్ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరగాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువవ్వాలన్నారు.
News July 8, 2025
చర్చకు రాకుంటే కేసీఆర్‌కు క్షమాపణ చెప్పు: KTR

TG: సీఎం రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ‘రేవంత్.. నిజాయితీ, నిబద్ధత ఉంటే చర్చకు రా. లేకపోతే తప్పుడు కూతలు కూసినందుకు, మహా నాయకుడిపై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి KCRకు క్షమాపణలు చెప్పు. చర్చ కోసం రేవంత్ ఎక్కడికి రమ్మన్నా వస్తా. చర్చకు సత్తా లేకపోతే సవాళ్లు చేయొద్దు. సీఎంకు వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.