News February 6, 2025
MHBD: ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలో పలు వార్డుల్లో తిరుగుతూ ఆసుపత్రిలో ఏమైన సమస్యలు ఉన్నాయా? అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలు అందించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు. అలాగే ఆసుపత్రిలో డెంటల్, ఫిజియోథెరపీ సేవలను అందించాలని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
వేగంగా కాదు.. క్షేమంగా వెళ్లండి: సిద్దిపేట సీపీ

వేగంగా వెళ్లడం కాదు.. క్షేమంగా వెళ్లడం ముఖ్యమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.ఎం.విజయ్ కుమార్ పేర్కొన్నారు. అతివేగం ఎప్పటికైనా ప్రమాదమే అని, వేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దని కోరారు. మీ నిర్లక్ష్యం ఇతరులకు శాపం కావద్దన్నారు. మీ క్షేమం కోసమే ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అతివేగంతో వెళ్లి మీ కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని అన్నారు.
News December 3, 2025
ముందుగా ఆర్డినెన్స్.. తర్వాత వీలిన నోటిఫికేషన్

గ్రేటర్ HYDలో మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ఆర్డినెన్స్ రావాల్సి ఉంది. వీలీన ప్రక్రియను గవర్నర్ ఇప్పటికే ఆమోదించడంతో త్వరలో ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ తర్వాత 3 రోజులకు ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వస్తుంది. ఇందుకోసం అధికారులు పేపర్‌వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డుల విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయం కూడా సేకరించనున్నారు.
News December 3, 2025
యాదాద్రి: రాజ్యాంగ నిర్మాత ఆశీస్సులతో నామినేషన్

రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా BSP మండలాధ్యక్షుడు నకిరేకంటి నరేశ్ మంగళవారం రాత్రి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డా.BR.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆశీస్సులు తీసుకుని నామినేషన్ కేంద్రం వరకు ర్యాలీగా వెళ్లారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గ అధ్యక్షుడు గూని రాజు, పావురాల నరసింహ యాదవ్, మారయ్య, రాజు ఉన్నారు.


