News March 13, 2025
MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News October 22, 2025
ఎల్లారెడ్డిపేట: ద్విచక్ర వాహనం బోల్తా.. మహిళ దుర్మరణం

ఎల్లారెడ్డిపేట(M) అక్కపెళ్లిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. కొనరావుపేట(M) సుద్దాలకు చెందిన దొబ్బల మరియమ్మ (55), తన రెండో కుమారుడు ప్రభాకర్తో కలిసి అల్మాస్పూర్లో బంధువులు చనిపోతే పరామర్శకు వెళ్తుంది. బుగ్గ రామేశ్వరం లింగం గుట్ట వద్దకు రాగానే మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో మరియమ్మ కింద పడింది. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. మరిన్ని వివరాలు తెలియాలి.
News October 22, 2025
కృష్ణా: సముద్ర స్నానాలు.. జాగ్రత్త వహించండి.!

కార్తీకమాసం సందర్భంగా సముద్ర, నది స్థానాల్లో స్నానం చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. మన ఉమ్మడి జిల్లా వారు. మంగినపూడి, సూర్యలంక, చీరాల బీచ్, కృష్ణానది ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అయినప్పటికీ కొన్నిచోట్ల ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కావున సముద్ర, నది స్నానాలకు వెళ్లేవారు లోతులను గమనించటంతో పాటు పిల్లలపై శ్రద్ధ వహించి క్షేమంగా ఉండాలని Way2news ఆశిస్తుంది.
News October 22, 2025
ట్రాన్స్కో, జెన్కోలో మరో 6 నెలల పాటు సమ్మెలపై నిషేధం

AP: రాష్ట్ర పవర్ కార్పొరేషన్లలో మరో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్కో పరిధిలోని మూడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో, జెన్కోలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. నవంబర్ 10 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వివరించింది. కాగా ఇంతకు ముందు మే 10 నుంచి నవంబర్ 9 వరకు వర్తించేలా సమ్మె నిషేధ జీవో ఇచ్చింది. తాజాగా గడువు పొడిగించింది.