News March 13, 2025
MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News March 19, 2025
రాజశేఖర్ టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం?

వైసీపీ MLC మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేశారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవల జగన్ పెట్టిన ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశానికి సైతం హాజరు కాలేదు. విడదల రజనీకి చిలకలూరిపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పడమూ ఇందుకు ఓ కారణం. పల్నాడులో కీలక నేతను కోల్పోవడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
News March 19, 2025
బడ్జెట్ సమావేశాలు.. భువనగిరి జిల్లాకు GOOD NEWS

యాదాద్రి జిల్లాకు తాగునీరు అందించేందుకు బ్రాహ్మణ వెల్లంల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నల్గొండ, భువనగిరి జిల్లాలో 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు, ఫ్లోరైడ్ సమస్య ఉన్న 107 గ్రామాలకు తాగునీటిని అందిస్తామని బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు. ఉదయ సముద్రం నుంచి 6.70 TMCల నీటిని బ్రాహ్మణ వెల్లంలకు లిఫ్ట్ చేస్తామన్నారు.
News March 19, 2025
అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా

TG: అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడింది. ఇరు సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కానుంది.