News March 13, 2025
MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News March 13, 2025
రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్

కర్నూలులో మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. గురువారం కర్నూలు నగర పాలక కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. 10 తీర్మానాలను, సాధారణ నిధుల నుంచి రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా ఊపారు. మేయర్ మాట్లాడుతూ.. ప్రజా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.
News March 13, 2025
సిరిసిల్ల: 19 లోపు సమావేశాలు పూర్తి చేయాలి: ఎన్నికల అధికారి

ఈనెల 19వ తేదీలోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో నూతన ఓటరు నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ వివరాల తొలగింపు పూర్తిస్థాయిలో అమలుచేయాలన్నారు.
News March 13, 2025
WNP: హోలీ పండగపై ఎస్పీ కీలక ప్రకటన.!

వనపర్తి జిల్లా ప్రజలు హోలీ పండగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని న్యాచురల్ కలర్స్ను వినియోగించి, ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో చేసుకోవాలని జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. జిల్లా ప్రజలు, యువత మద్యం సేవించి వాహనాలను నడపడం, బహిరంగ ప్రదేశాలపై, ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడదు అన్నారు.