News March 13, 2025
MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News March 16, 2025
తిరుపతిలో దారుణం..!

తిరుపతిలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి క్రిందకు తోసేసింది. దీంతో 14 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి గోప్యంగా చికిత్సను స్కూల్ యాజమాన్యం అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 16, 2025
మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారీ ఇచ్చిన కొడుకు

తండ్రిపై దాడి చేయించేందుకు సుపారీ ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్‌కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.
News March 16, 2025
పల్నాడు జిల్లాలో నిలకడగా చికెన్ ధరలు

పల్నాడు జిల్లాలో చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. లైవ్ కోడి కేజీ రూ.95, స్కిన్‌లెస్ రూ.200లు , స్కిన్‌తో రూ.180లుగా ఉంది. నాటుకోడి రూ.500ల నుంచి రూ.750ల వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలలో మార్పులేదు. మటన్ ధర కేజీ రూ.1,000లుగా ఉంది. 100 కోడిగుడ్లు రూ.460-480 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో చికెన్‌కు ఆదివారం డిమాండ్ కొనసాగుతోంది.