News March 13, 2025

MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

image

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Similar News

News October 23, 2025

అన్నాచెల్లెళ్ల పండుగ.. శుభ సమయం ఏదంటే?

image

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ‘భాయ్ దూజ్’ పర్వదినాన, సోదరీమణుల చేతి భోజనం సోదరులకు దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని పండితులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ దివ్య ఆచరణకు ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయం అని సూచిస్తున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ భగినీ హస్త భోజన ఘట్టాన్ని ఆచరించడానికి సమయం అనుకూలంగా ఉందంటున్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను దృఢపరుస్తుంది.

News October 23, 2025

మామిడి పంటలో ఈ సమయంలో ఏం చేయాలి?

image

అక్టోబర్ రెండో పక్షంలో మామిడి చెట్టుకు పొటాషియం నైట్రేట్ (మల్టీ.కే లేదా 13-0-45 నీటిలో కరిగే ఎరువు) లీటరు నీటికి 10-15గ్రా మరియు ఫార్ములా-4 లీటరు నీటికి 2.5గ్రా లేదా అర్క మ్యాంగో స్పెషల్ 5గ్రా. కలిపి పిచికారీ చేయాలి. ఈ పోషకాలు పూమొగ్గలు ఏర్పడటానికి ప్రేరణ కలిగిస్తాయి. ఈ నెలాఖరు నుంచి రైతులు మామిడి చెట్టుకు నీరుపెట్టడం పూర్తిగా ఆపేయాలి. లేకుంటే పూతకు బదులు ఆకు ఇగురువచ్చి పంటను కోల్పోవలసి వస్తుంది.

News October 23, 2025

UCO బ్యాంక్‌లో 532 పోస్టులు

image

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO) 532 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.15000 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.uco.bank.in/