News October 24, 2024

MHBD: బడి ఉంది బాట లేదు.. జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం

image

MHBD జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండాలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఉండి, బాట లేకపోవడంతో MHBD జిల్లా వాసి, జాతీయ ST కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సౌకర్యాలు ఉన్నా.. పొలం గట్టు నుంచి గిరిజన విద్యార్థులు బడికి వెళ్తుండటంతో ఆయన మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల పట్ల అధికారులకు ఎందుకింత చిన్నచూపు అని సంబంధిత అధికారులను ప్రశ్నించారు.

Similar News

News November 14, 2024

BREAKING.. జనగామ జిల్లాలో అర్ధరాత్రి హత్య

image

జనగాం జిల్లాలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. రఘునాథ్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి పర్వత యోగేందర్ అనే వ్యక్తి గంపల పరశరాములుపై గొడ్డలితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 14, 2024

వరంగల్ జిల్లాలో పెరుగుతున్న చలి

image

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. జిల్లాలో ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. అలాగే, పొగమంచు సైతం ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. చలి నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 14, 2024

పిల్లల ఈ దేశ భవిష్యత్తు అని గట్టిగా నమ్మారు: మంత్రి కొండా

image

భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని.. దేశానికి వారు అందించిన సేవలను, త్యాగాలను మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు అని గట్టిగా నమ్మిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని మంత్రి అన్నారు. పిల్లలకు సరైన విద్య, శిక్షణ, సంరక్షణ ఉంటే వారు దేశానికి మూలస్తంభాలుగా నిలుస్తారని భావించి ఆ దిశగా కార్యాచరణను అమలుచేసిన దార్శనికుడు నెహ్రూ అని మంత్రి తెలిపారు.