News March 14, 2025
MHBD: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

MHBDలో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
Similar News
News March 15, 2025
జాతీయస్థాయి పోటీలకు మంచిర్యాల క్రీడాకారిణి

మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకట జనని జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రవి, శివమహేశ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. జననిని అసోసియేషన్ సభ్యులు, తదితరులు అభినందించారు.
News March 15, 2025
ADB: రేపే ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి కోసం ప్రవేశానికి ఈ నెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు RCO అగస్టీన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంద్రవెల్లిలోని పాటగూడ, ఉట్నూర్, అసిఫాబాద్‌లోని సిర్పూర్(టి) EMRS పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 15, 2025
మార్చి15: చరిత్రలో ఈరోజు

*1493: మెుదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్
*1564: జిజియా పన్ను రద్దు
*1934: బీఎస్‌పీ పార్టీ స్థాపకుడు కాన్షీరాం జననం
*1937: తెలుగు సాహితి విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం
* 1950: ప్రణాళిక సంఘం ఏర్పాటు
*1983: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
*1990: సోవియట్ యూనియన్ మెుదటి అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక