News May 11, 2024
MHBD: బీజేపీ, బీఆర్ఎస్‌ల మాటలు నమ్మొద్దు: బలరాం నాయక్

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని, ప్రజలు తనకు అండగా నిలవాలన్నారు.
Similar News
News February 14, 2025
వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే 5,531 మిర్చి రూ.11 వేలు, దీపిక మిర్చి రూ.17,500, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 1048 రకం మిర్చి రూ.11 వేలు, మక్కలు (బిల్టీ) రూ. 2,355, సూక పల్లికాయ రూ.6,500, పచ్చి పల్లికాయకి రూ.4,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
News February 14, 2025
వరంగల్ ఎంజీఎంలో పోలీసుల తనిఖీలు

విజిబుల్ పోలీసింగ్‌తో పాటు నేరాల నియంత్రణలో భాగంగా మట్టెవాడ పోలీసులు శుక్రవారం సాయంత్రం ఎంజీఎంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆస్పత్రి పరిసరాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను, బ్యాగులను తనిఖీ చేయడంతో పాటు వారి వివరాలను నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మట్టెవాడ ఎస్ఐ విఠల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
News February 14, 2025
వరంగల్: WOW.. ప్రేమ పెళ్లి.. ఇద్దరికీ ఉపాధ్యాయ కొలువులు!

ప్రేమించుకున్న ప్రతి జంట పెళ్లి పీటలెక్కడం చాలా అరుదు. పెద్దలు ఒప్పుకోకపోవడం, ఇతర కారణాలతో విడిపోయినవారినే ఎక్కువగా చూస్తుంటాం. కానీ, వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన వినయ్, నాగలక్ష్మిలు ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులుగా ఉన్న వీరు.. 2019లో వివాహం చేసుకున్నారు. అంతేకాదు, 2024 డీఎస్సీలో ఇద్దరు ఉపాధ్యాయ కొలువులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.