News March 26, 2025
MHBD: బెట్టింగ్ పెట్టీ ఇబ్బందులు పడకండి: ఎస్పీ

బెట్టింగ్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. కోలుకోలేని విధంగా ఆర్థికనష్టం జరిగితే, చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే.. IPLఅనేది తిమింగలాలు నిర్వహించే ఒక వ్యాపారం అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు.
Similar News
News April 2, 2025
తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక సమావేశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశానికి వివిధ జిల్లాల నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని అభినందించిన జగన్, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్లో కొనసాగాలని నేతలకు సూచించారు.
News April 2, 2025
సిద్దిపేట: ‘జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి’

సిద్దిపేట జిల్లా నూతన మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) పి. వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో ఎక్కడా తాగు నీటి సమస్యలు తలెత్తకుండా పని చేయాలని కలెక్టర్ సూచించారు.
News April 2, 2025
సంగారెడ్డి: ‘పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు..’

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వల్లూరు క్రాంతి, నాయకులు పాల్గొన్నారు.