News March 14, 2025

MHBD: బైకులో పాము కలకలం (PHOTO)

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివాజీ బైక్‌లో పాము చేరింది. శివాజీ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌లో పాము దూరింది. వెంటనే పైకి లేవగా, అప్రమత్తమైన అధికారి బైక్‌ను పక్కకు నిలిపాడు. సుమారు 2 గంటల తర్వాత పాము కిందకు దిగివెళ్లిపోవడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.

Similar News

News April 20, 2025

అనితర సాధ్యుడు చంద్రబాబు: పవన్ కళ్యాణ్

image

AP CM చంద్రబాబుకు Dy.CM పవన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అనితర సాధ్యుడు చంద్రబాబు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై శాంతిభద్రతలు క్షీణించిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేయడం ఆయనలాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. ఆయన విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థల్ని నడిపించే విధానం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు.

News April 20, 2025

VZM: మహిళ దారుణ హత్య

image

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 20, 2025

ఎన్టీఆర్: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా డైరెక్టర్- ల్యాండ్స్, జూనియర్ లైవిలీ‌హుడ్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు శనివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలని ఆయన సూచించారు.

error: Content is protected !!