News September 17, 2024

MHBD: బ్రెయిన్ ట్యూమర్‌తో యువతి మృతి

image

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ.. యువతి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గాంధీనగర్‌కు చెందిన హరిదాస్యపు వైష్ణవి(24) బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో గత కొద్ది రోజులుగా బాధపడుతోంది. కాగా, చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 17, 2025

వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 128.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖిల్లా వరంగల్ మండలంలో అత్యధికంగా 27.8 మి.మీ వర్షం పడగా, గీసుగొండ 18, వరంగల్ 15.8 వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 9.9 మి.మీగా నమోదైంది.

News September 17, 2025

వరంగల్: ఐక్యతతోనే విజయం సాధ్యం

image

ఐక్యతతోనే విజయం సాధ్యం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ గడ్డ ఎల్లప్పుడూ పోరాటపటిమను ప్రదర్శిస్తోందని వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్న సందేశాన్ని కొనసాగిస్తూ విజయపథంలో ముందుకు సాగుదాం అంటూ తమ అధికారిక X ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.

News September 16, 2025

సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ హాల్టింగ్

image

కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈనెల 18 నుంచి సికింద్రాబాద్-నాగ్పూర్(20102), ఈనెల 19 నుంచి నాగ్పూర్-సికింద్రాబాద్(201010) ఎక్స్‌ప్రెస్ సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో అధికారికంగా హాల్టింగ్ అవుతుందని స్పష్టం చేశారు.