News April 5, 2025
MHBD: భద్రాచలానికి RTC ప్రత్యేక బస్సులు

భద్రాచలంలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మహబూబాబాద్ డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈనెల నెల 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లే మహబూబాబాద్ పరిసర ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News December 25, 2025
మైలవరంలో ఓ విలాస భవనం.. దీని చరిత్ర మీకు తెలుసా..?

బ్రిటిష్ కాలం నాటి జమీందారీ వ్యవస్థకు గుర్తుగా మైలవరంలోని కోడిగుడ్డు మేడ. 1906లో ప్రారంభమై 1915లో పూర్తయిన ఈ భవనం, 3ఎకరాల స్థలంలో నిర్మించబడింది. సూరానేని వంశీయుల పాలనలో ఉన్న ఈ జమీందారీ వద్ద నుంచి 1970లలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కుటుంబం దీనిని కొనుగోలు చేయగా, 1992లో లకిరెడ్డి హనిమిరెడ్డి, రూ.25,000కు కొనుగోలు చేసి, ఆధునికరించి 2 బురుజులు నిర్మించి నివాసానికి ఉపయోగిస్తున్నారు.
News December 25, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి లీడర్లు విఫలం!

బెంజ్ సర్కిల్ నుంచి పెనమలూరు (ORR) వరకు ఫ్లైఓవర్, అండర్పాస్ల నిర్మాణాలను కాదని, కేవలం సర్వీసు రోడ్లకే NHAI మొగ్గుచూపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ చిన్ని వెస్ట్ బైపాస్కు ఫ్లైఓవర్ మంజూరు చేయించుకోగా, కృష్ణా జిల్లా నేతలు పెనమలూరు వరకు ఫ్లై ఓవర్ సాధించడంలో విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న కూడళ్ల వద్ద కనీసం అండర్పాసులైనా నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News December 25, 2025
సిద్దిపేట: గురుకుల పాఠశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘీక, గిరిజన, వెనుకబడిన సంక్షేమ శాఖలో, సాధారణ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కో ఆర్డినేటర్ డా.శారద వెంకటేష్ తెలిపారు. జనవరి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సిద్దిపేటలో 8 బాలుర, 8 బాలికల పాఠశాలలు ఉన్నాయన్నారు.


