News June 14, 2024
MHBD: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతు గూడెం తండాలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గత వారం భర్త రవి సంగెం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక భార్య సరిత గురువారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 14, 2024
కాజీపేటలో వందేభారత్ హాల్ట్
సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.
News September 14, 2024
వరంగల్ జిల్లాకు రూ.3కోట్లు
ఇటీవల కురిసిన వర్షాలు జిల్లాలో తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టవివరాలను అందజేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో జిల్లాకు రూ.3కోట్ల నిధులను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట అంచనా తయారు చేయాలని ఆమె సూచించారు.
News September 14, 2024
దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయింది: సీతక్క
దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా సీతారాం ఏచూరి గుర్తింపు పొందారని, దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసుకున్న ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని అన్నారు.