News March 13, 2025
MHBD: మటన్ కోసం మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్టు

మహబూబాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మటన్ కోసం భార్యను మర్డర్ చేసిన వ్యక్తిని సీరోల్ పోలీస్లు గురువారం అరెస్టు చేశారు. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చూసుకునే బాధ్యత అందరి పైన ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
CSK నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

ఓపెనర్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్(CSK) వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కాన్వే ట్వీట్ చేశారు. మూడేళ్లు పాటు మద్దతుగా నిలిచిన CSK ఫ్యాన్స్కు Xలో ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్లో జెర్సీతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేశారు. ఐపీఎల్లో CSK తరఫున 29 మ్యాచులు ఆడిన కాన్వే 43.2 సగటుతో 1080 పరుగులు చేశారు. ఇందులో 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓపెనర్గా జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించారు.
News November 15, 2025
కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్: మంత్రి వివేక్

జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అని విమర్శించారు. ఆయన నాయకత్వంలో పనిచేయాలో లేదో హరీష్ రావు తేల్చుకోవాలని సూచించారు.
News November 15, 2025
బిహార్ రిజల్ట్స్: 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. జోకిహట్, బహదుర్గంజ్, కొచ్చదామన్, అమౌర్, బైసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అభ్యర్థులందరికీ 20వేలకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. 2020 ఎన్నికల్లో ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అదనంగా బహదుర్గంజ్ స్థానంలో గెలవడం విశేషం. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసింది.


