News February 23, 2025

MHBD: మహా శివరాత్రి.. మరో 3 రోజులే!

image

శివరాత్రి వేడుకలకు ఓరుగల్లు పెట్టింది పేరు. WGL నగరంలోని వేయి స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టుగుట్ట సహా పలు దేవాలయాలు భక్తులతో పండుగరోజు నిండిపోతాయి. ఐనవోలు(HNK), రామప్ప(ములుగు), కాళేశ్వరాలయం(BHPL), పాలకుర్తి సోమేశ్వర(జనగామ), కురవి వీరభద్రస్వామి(MHBD) దేవాలయాలు జాగారం ఉన్న శివ భక్తులతో కిటకిటలాడతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News February 23, 2026

పల్నాడు: పోలీస్ గ్రీవెన్స్‌కు 117 ఫిర్యాదులు

image

పల్నాడు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం PGRS నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏస్పీలు JV. సంతోష్ ,
M. లక్ష్మీపతి పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి మొత్తం 117 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు పలు మోసాలు, బెదిరింపులపై ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. చట్ట ప్రకారం బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.

News February 23, 2026

NGKL: ‘జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి’

image

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు షరతులు లేకుండా, పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని TWJF జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, వెంకటస్వామి, పరమేశ్ కోరారు.

News February 23, 2026

జనగామ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

image

దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న గ్రామీణ శ్రేయస్సు, స్థితిస్థాపకత కార్యక్రమం పరిశీలనలో భాగంగా కేంద్ర బృందం జనగామ జిల్లాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా వారు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. 6 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టనుంది.