News August 10, 2024
MHBD మహిళా ఇన్‌ఛార్జిగా విజయలక్ష్మి

బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఇన్‌ఛార్జిగా బానోతు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలో బీజేపీ బలోపేతానికి కష్టపడి పని చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు.
Similar News
News February 27, 2026
గ్రేటర్ వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు: కలెక్టర్

ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బస్సుల నిర్వహణకు అవసరమైన డిపో స్థలాన్ని త్వరగా అప్పగించాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
News February 26, 2026
ఏనుమాముల మార్కెట్‌లో ఉద్యోగుల బదిలీ

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను
అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్‌ను ఎనుమాముల మార్కెట్ లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు. ఈ అంతర్గత బదిలీలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
News February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం: కలెక్టర్

కాకతీయ కెనాల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెనాల్ పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి సౌకర్యం మెరుగుపడితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.


