News April 8, 2025

MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.

Similar News

News November 25, 2025

UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

image

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<>UIDAI<<>>) 8 టెక్నికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. షార్ట్ లిస్ట్, స్క్రీన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://uidai.gov.in/

News November 25, 2025

నల్గొండ: రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు

image

నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న 10.82 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ప్రభుత్వం ఏటా రూ.12,000 అందిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి సహాయం ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

News November 25, 2025

ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

image

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.