News April 8, 2025
MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.
Similar News
News April 22, 2025
గిల్ పెళ్లిపై ప్రశ్న.. ఆయన ఆన్సరిదే

నిన్న KKR-GT మ్యాచ్ టాస్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ పెళ్లి ప్లాన్స్ గురించి అడిగి కామెంటేటర్ డానీ మోరిసన్ నవ్వులు పూయించారు. ‘నువ్వు అందంగా ఉన్నావ్. త్వరలో పెళ్లి చేసుకుంటున్నావా?’ అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ప్రిన్స్ సమాధానమిచ్చారు. కాగా సచిన్ కూతురు సారాతో గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించలేదు.
News April 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 22, 2025
ధర్పల్లి: వడదెబ్బతో రైతు మృతి

ధర్పల్లి మండలం వాడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వడదెబ్బతో కరక రాములు(65) అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల తన పొలంలో యంత్ర సాయంతో పంట కోయించారు. యంత్రం వెళ్లలేని ప్రాంతంలో మిగిలిపోయిన పంటను ఉదయం నుంచి కోస్తూ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు.