News April 8, 2025
MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.
Similar News
News December 2, 2025
HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.
News December 2, 2025
ఈసారి IPL వేలంలో పాల్గొనట్లేదు: మ్యాక్స్వెల్

IPL-2026 వేలంలో తాను పాల్గొనట్లేదని ఆస్ట్రేలియన్ క్రికెటర్ <<18444972>>మ్యాక్స్వెల్<<>> ప్రకటించారు. అనేక సీజన్ల తర్వాత ఈ ఏడాది వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ తనను క్రికెటర్గా, వ్యక్తిగా తీర్చిదిద్దిందని తెలిపారు. వరల్డ్ క్లాస్ టీమ్మేట్స్, ఫ్రాంచైజీలతో పనిచేయడం తన అదృష్టమని, ఏళ్లుగా మద్దతిచ్చిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. త్వరలో కలుస్తానని పేర్కొన్నారు.
News December 2, 2025
ASF: గుర్తులు రెఢీ.. రేపే ఉపసంహరణకు చివరి రోజు

ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్ కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్ ను నిర్ణయించారు. ఆల్ఫాబెటికల్గా గుర్తులను కేటాయిస్తారు. ఏ గుర్తు ఎవరికి వస్తుందని చర్చించుకుంటున్నారు.


