News April 8, 2025
MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.
Similar News
News April 20, 2025
రేపటి నుంచి UAEలో IAF సైనిక విన్యాసాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ‘డెజర్ట్ ఫ్లాగ్ 10’ పేరిట నిర్వహించే మల్టీ నేషనల్ సైనిక విన్యాసాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) పాల్గొననున్నట్లు డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. మిగ్-2, జాగ్వర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను IAF పంపనుంది. US, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతర్, సౌదీ, సౌత్ కొరియా, టర్కీ, UK ఎయిర్‌ఫోర్సెస్ పాల్గొనే ఈ విన్యాసాలు మే 8 వరకు జరగనున్నాయి.
News April 20, 2025
అల్లూరి: కూలీ కుమారుడికి జిల్లా ఫస్ట్ ర్యాంక్

చింతూరు మండలం గోరంగుంపు గ్రామానికి చెందిన ఎం.ప్రశాంత్ కుమార్ ఏకలవ్య 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్షలో 100కి 82మార్కులతో అల్లూరి జిల్లాలో ఫస్ట్, స్టేట్‌లో 6వ ర్యాంక్‌లో నిలిచాడని డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య ఆదివారం తెలిపారు. తండ్రి నాగేశ్వరరావు, తల్లి మంజుల ఉపాధి కూలి పని చేసి ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు. అల్లిగూడెం ఎంపీపీ పాఠశాల టీచర్స్, పేరెంట్స్ ప్రోత్సాహంతో ర్యాంక్ వచ్చిందని ప్రశాంత్ అన్నాడు.
News April 20, 2025
మెగా DSC.. వారికి ఫీజు నుంచి మినహాయింపు

AP: ప్రభుత్వం రిలీజ్ చేసిన <<16157650>>మెగా డీఎస్సీకి<<>> దరఖాస్తుల సమయంలో ఫీజు కట్టే విషయంలో కొందరు అభ్యర్థులకు గందరగోళం నెలకొంది. గత ఏడాది వైసీపీ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కేవలం అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాలి. గతంలో కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే పోస్టుకు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.