News April 8, 2025
MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.
Similar News
News October 27, 2025
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పిల్లర్‌కు దీప్తి పెయింటింగ్

జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవంజి దీప్తి పెయింటింగ్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పిల్లర్‌కు వేశారు. పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించడమే కాకుండా ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును సైతం దీప్తి సొంతం చేసుకుంది. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2025లో భాగంగా రెండు స్వర్ణాలను సాధించింది. దీంతో ప్రభుత్వం ఆమె పెయింటింగ్‌ను పిల్లర్‌పై వేయించింది.
News October 27, 2025
డీసీసీ పీఠం పర్వతగిరికి దక్కేనా..?

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం పర్వతగిరికి దక్కుతుందా? అని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం ప్రారంభించిన నేపథ్యంలో పర్వతగిరి మండలం నుంచి ఇరువురు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏనుగల్లు గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు ఉన్నారు.
News October 27, 2025
జూబ్లీహిల్స్‌లో అభ్యర్థులకు రకరకాల గుర్తులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు ఉండగా వారికి ఎన్నికల అధికారులు వివిధ గుర్తులను కేటాయించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో యాపిల్, ద్రాక్ష, గాలి కొట్టే పంపు, బెలూన్, బేబీ వాకర్, కూలర్, టీవీ రిమోట్, బెల్ట్ తదితర గుర్తులను కేటాయించారు. అయితే ఈ గుర్తులను అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.


