News February 9, 2025
MHBD: రేపు కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి(గ్రీవెన్స్ సెల్)ని రేపు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఎమ్మెల్సీ కోడ్, ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజల సౌకర్యార్థం వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News December 3, 2025
ప్రమోషన్లు, సీనియారిటీ సమస్యల పరిష్కారానికి CMD హామీ

వరంగల్లో TGNPDCL ట్రేడ్ యూనియన్ల JAC ప్రతినిధులు CMD కర్నాటి వరుణ్ రెడ్డి ని కలిసి O&M, Provincial కేడర్లలో నిలిచిన ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అనంతరం ప్రమోషన్లు ఇస్తామని, అలాగే Paid Holiday, JAO సీనియారిటీ, ఆర్టిజన్లు,అన్మెన్,పీస్ రేటు కార్మికుల సమస్యలు మరియు కొత్త పోస్టుల భర్తీపై త్వరలో చర్యలు తీసుకుంటామని CMD హామీ ఇచ్చారు.
News December 3, 2025
HYD: ట్రాఫిక్ తగ్గించేందుకు హైవేల విస్తరణ: NHAI

HYDలో ట్రాఫిక్ తగ్గించడం కోసం హైవేలను పలుచోట్ల విస్తరిస్తున్నట్లు NHAI తెలిపింది. HYD- బెంగళూరు హైవే 44లో భాగమైన ఆరాంఘర్, శంషాబాద్ రూట్లో 10KM మేరకు 6 లైన్ వరకు విస్తరణ జరిగిందని, దీని ద్వారా ఫలితాలు అద్భుతంగా ఉన్నట్లుగా పేర్కొంది. దీనిని పరిగణలోకి తీసుకొని మిగతా ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లుగా వివరించింది.
News December 3, 2025
నల్గొండ: మొక్కవోని ధైర్యం.. అతడి సొంతం..!

రైలు ప్రమాదంలో దివ్యాంగుడిగా మారిన యువకుడు మొక్కవోని ధైర్యంతో స్వశక్తితో ముందుకు సాగుతున్నాడు. యాదాద్రి జిల్లా సిరిపురానికి చెందిన మిర్యాల కిషోర్ 2017లో రైలు ప్రమాదంలో కాళ్లు దెబ్బతిన్నాయి. ధైర్యం కోల్పోకుండా పాటలు రచిస్తూ, సంగీతం సమకూర్చి సొంత ఛానల్ ద్వారా ఉపాధిని ఏర్పరచుకున్నాడు. సిరిపురం కిషోర్గా పేరు పొందాడు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పాటలు రచిస్తూ సంగీతం సమకూర్చి గానం చేస్తున్నాడు.


