News February 9, 2025

MHBD: రేపు కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి(గ్రీవెన్స్ సెల్)ని రేపు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఎమ్మెల్సీ కోడ్, ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజల సౌకర్యార్థం వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ తెలిపారు.

Similar News

News February 13, 2026

ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.

News February 13, 2026

NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో NOV 2025లో నిర్వహించిన మాస్టర్ ఆఫ్ వొకేషన్ 3వ సెమిస్టర్, AUG 2025లో నిర్వహించిన డిప్లొమా ఇన్ మ్యూజిక్(వోకల్) రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ANU అధికారిక వెబ్‌సైట్‌ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.

News February 13, 2026

గచ్చిబౌలిలో నోట్ల కట్టలతో పారిపోయాడు!

image

గచ్చిబౌలిలో పట్టపగలే నగదు చోరీ జరిగింది. గోపన్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సీఎంఎస్ వాహన డ్రైవర్ అజిత్ అలియాస్ శివ రూ.57 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. కస్టోడియన్లు బ్యాంక్‌లో ఉండగా సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లిన సమయం చూసి చోరీ చేశాడు. వాహనాన్ని తెల్లాపూర్ వద్ద వదిలేసి నగదుతో నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.