News April 16, 2025
MHBD: రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం.. పౌర సరఫరాల శాఖ క్లారిటీ

రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం అబద్ధమని మహబూబాబాద్ జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ప్రేమ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీచేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఈ పుకార్లు నమ్మవద్దన్నారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు.
Similar News
News April 21, 2025
JEE MAINS.. ఒకే గ్రామంలో 40 మంది పాస్!

సాధారణంగా ఓ గ్రామంలో ఒకరో, ఇద్దరో JEE మెయిన్స్‌లో ఉత్తీర్ణులవుతుంటారు. కానీ, బిహార్‌లోని పట్వటోలి అనే గ్రామంలో ఏకంగా 40 మంది మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో గ్రామంలో ఉచితంగా కోచింగ్ ఇస్తోన్న ‘వృక్ష సంస్థాన్’ నుంచి 28 మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఇంటికో ఇంజినీర్ ఉండటం విశేషం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రతిచోట ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
News April 21, 2025
NLR: వాగులో మహిళ మృతదేహం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సోమవారం మహిళ మృతదేహం కలకలం రేపింది. అనికేపల్లి సమీపంలోని కర్రోడ వాగులో మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామస్థులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. వెంకటాచలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News April 21, 2025
విద్యార్థుల ఫోన్ నంబర్లకే EAPCET ఫలితాలు

TG: ఈఏపీసెట్ ఫలితాలను విద్యార్థుల ఫోన్ నంబర్లకే పంపాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. అప్లికేషన్ సమయంలో రిజిస్టర్ చేసుకున్న నంబర్‌కు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ, మే 2, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి 3.05 లక్షల మంది విద్యార్థులు EAPCET రాయనున్నారు. పరీక్షల అనంతరం 10 రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశముంది.