News October 1, 2024
MHBD: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతుళ్లకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతుళ్లకు గాయాలైన ఘటన కొత్తగూడ మండలంలో చోటుచేసుకుంది. MHBD జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మధు.. తన ఇద్దరు కూతుళ్లను నర్సంపేటలో హాస్టల్లో చదివిస్తున్నారు. దసరా సెలవులు రావడంతో మంగళవారం బైకుపై కూతుళ్లతో కలిసి పెగడపల్లికి వస్తున్నాడు. కొత్తగూడ సమీపంలో బైకును కారు ఢీకొట్టడంతో మధు కాలు విరగగా.. ఇద్దరమ్మాయిలకు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 16, 2024
సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ప్రావీణ్య
సఖి కేంద్రంలో అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న వివిధ సేవలకు సంబంధించిన పోస్టర్‌తో పాటు వీడియోను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు సఖి కేంద్రాన్ని సంప్రదిస్తున్నట్లు చెప్పారు. బాధిత మహిళలకు బాసటగా నిలుస్తోందన్నారు.
News October 15, 2024
వరంగల్: మహిళా కానిస్టేబుల్ మృతి
వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ధరణికి ఇటీవల కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆమెను వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. మంగళవారం తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 15, 2024
సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం: వరంగల్ సీపీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇకపై పోలీస్ సిబ్బంది తమ వ్యక్తిగతం కాని శాఖపరమైన సమస్యలు ఉంటే నోడల్ అధికారి ఫోన్ నంబర్ 9948685494కు తమ ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయాల్సి ఉంటుందన్నాన్నారు.