News January 24, 2026
MHBD: రోడ్ సేఫ్టీ అవగాహన కోసం బైక్ ర్యాలీ: SP

రోడ్డు భద్రతపై అవగాహన కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 6:30 గంటలకు తలపెట్టనున్న బైక్ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ డాక్టర్ శబరిష్ సూచించారు.“Arrive Alive” కార్యక్రమంలో భాగంగా MHBD టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందాన్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్యే మురళి నాయక్ బైక్ ర్యాలీకి హాజరుకానున్నట్లు తెలిపారు.
Similar News
News February 18, 2026
పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాత్కాలిక, గంటల ప్రాతిపదికన బి.ఈ (CSE, AI & ML, DS), 3-సంవత్సరాల LLB, LLM (IPR) కోర్సులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు విధానం, అర్హత వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుల చివరి తేదీ ఈనెల 24 వరకు ఉంటుందని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి.రమేష్ బాబు తెలిపారు.
News February 18, 2026
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) ఇంజినీర్, Jr. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, తదితర పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 25 నుంచి మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(CBT), గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/
News February 18, 2026
అలిపిరిలో పురాతన మండపం తొలగింపు

చాలామంది కాలినడకన తిరుమలకు వెళ్తారు. అలిపిరి వద్ద తొలి మెట్టు ఎక్కగానే కుడి వైపున పురాతన పాదాల మండపం ఉండేది. ఇకపై మీకు అది కనిపించదు. దీనిని పూర్తిగా తొలగించారు. పుణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్స్ ట్రస్ట్ నేతృత్వంలో ఆర్కియాలజీ అధికారులు పర్యవేక్షణలో మండలంలోని దూలాలు, స్తంభాలను జాగ్రత్తగా తొలగించి భద్రపరిచారు. తొలగించక ముందు, ఆ తర్వాత ఎలా ఉందో పై ఫొటోలో చూడవచ్చు.


