News February 26, 2026
MHBD: విద్యార్థిపై ఆంగన్‌వాడీ ఆయా దాడి

మహబూబాబాద్ జిల్లా మాంగోలిగూడెం గ్రామానికి చెందిన ఓ అంగన్‌వాడీ ఆయా వీధి రౌడీలా ప్రవర్తించింది. తన కుమారుడితో పాఠశాలలో గొడవ పడ్డాడన్న కోపంతో జయ్యారం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిపై ఆమె దాడికి తెగబడింది. పాఠశాల ముగిసి ఇంటికి వెళ్తున్న సమయంలో సదరు విద్యార్థిని అడ్డగించి కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు స్పందించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News April 18, 2026
బార్ హెల్పర్‌పై దాడి ఘటనలో ముగ్గురిపై కేసు: SI జయలక్ష్మి

నరసాపురంలోని ఒక రెస్టారెంట్ అండ్ బార్‌లో గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుందని SI జయలక్ష్మి తెలిపారు. బార్ ముగిసే సమయం కావడంతో వెళ్లిపోవాలని కోరిన హెల్పర్ పులపర్తి వెంకట బాలాజీపై వర్ధినీది సాయి, పాలూరి బోల, పాలూరి నరసింహ మద్యం బాటిల్‌తో దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో బాలాజీ నుదుటిపై తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 18, 2026
భద్రాచలంలో నేడు జాబ్ మేళా

భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సేల్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఖాళీలు ఉండగా.. ఎంపికైన వారికి రూ.15,000 నుంచి రూ.35,000 వరకు వేతనం లభిస్తుంది. 18-29 ఏళ్ల మధ్య ఉండి, పదో తరగతి నుంచి పీజీ, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు. మరిన్ని వివరాలకు 9989209575 నంబర్‌ను సంప్రదించవచ్చు.
News April 18, 2026
వచ్చే సీజన్‌కు KKR కోచ్‌గా మెక్‌కల్లమ్: పీటర్సన్

వచ్చే సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ వస్తారని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అంచనా వేశారు. ఇది జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తూ తన ట్వీట్‌ను బుక్ మార్క్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా 2022 నుంచి మెక్‌కల్లమ్ కొనసాగుతున్నారు. గతంలో KKRకు ఆడారు. మరోవైపు KKR పేలవ <<19678736>>ప్రదర్శన<<>> కొనసాగుతోంది. ఒక్క గెలుపూ లేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.


