News February 26, 2026

MHBD: విద్యార్థిపై ఆంగన్‌వాడీ ఆయా దాడి

image

మహబూబాబాద్ జిల్లా మాంగోలిగూడెం గ్రామానికి చెందిన ఓ అంగన్‌వాడీ ఆయా వీధి రౌడీలా ప్రవర్తించింది. తన కుమారుడితో పాఠశాలలో గొడవ పడ్డాడన్న కోపంతో జయ్యారం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిపై ఆమె దాడికి తెగబడింది. పాఠశాల ముగిసి ఇంటికి వెళ్తున్న సమయంలో సదరు విద్యార్థిని అడ్డగించి కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు స్పందించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News April 18, 2026

గజ్వేల్: భూసార పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చేనా..?

image

గజ్వేల్ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని 2023 అక్టోబరులో గత ప్రభుత్వంలో హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే దీనికి ఇప్పటికీ సిబ్బంది నియామకం, ల్యాబ్ పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, తమ భూములను పరీక్షించుకునే వెసులుబాటు కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

News April 18, 2026

కాళేశ్వరం బ్యారేజ్‌ల పరిశీలనకు 43 రోజుల గడువు

image

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల వైఫల్య కారణాల విశ్లేషణకు రాష్ట్ర ప్రభుత్వం 43 రోజుల గడువు నిర్ణయించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో 9 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. మే 30లోగా పరీక్షలు పూర్తి చేసి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

News April 18, 2026

GNT: పెరుగుతున్న కులాంతర వివాహాలు

image

సమాజంలో కులాల అడ్డు గోడలు కూలుతున్నాయి. యువత ఆలోచనల్లో విశేష మార్పు వస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా 600కు పైగా కులాంతర పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నగరాల్లో ఈ సంఖ్య పెరుగుతుండగా, పల్లెల్లో ఇంకా భయం నెలకొంది. ఈ పెళ్లిళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత ముందున్నారు. వేర్వేరు కులాల మధ్య వివాహాలతో జన్యు వైవిధ్యం పెరిగి భావితరాలు ఆరోగ్యంగా ఉంటాయని సైన్స్ చెబుతోంది.