News April 3, 2025
MHBD: హత్య కేసును ఛేదించిన పోలీసులు

MHBDలో జరిగిన <<15975323>>హత్య<<>> కేసును పోలీసులు చేధించారు. SP సుదీర్ రామ్నాథ్ వివరాలు.. పార్థసారథి అతడి భార్య స్వప్న మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో స్వప్న ఆమె ప్రియుడు విద్యాసాగర్తో కలిసి నలుగురు దుండగులకు రూ.5లక్షలు సుపారి ఇచ్చి మంగళవారం దంతలపల్లికి డ్యూటీకి వెళ్తున్న పార్థసారథిని హత్య చేయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్వప్న, విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు. కాగా హత్య చేసిన నలుగురు పరారీలో ఉన్నారు.
Similar News
News November 7, 2025
వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక: ఎస్పీ

కాకినాడ: స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిన ‘వందేమాతరం’ గీతం రచనకు ఈ రోజుతో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ, భారతమాత చిత్రపటాలకి ఎస్పీ, పోలీస్ అధికారులు పుష్పాంజలి సమర్పించారు. వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక అని వారు అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
News November 7, 2025
విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.
News November 7, 2025
HYD నగరానికి ప్రతిష్ఠాత్మక అవార్డు!

తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. హైదరాబాద్ నగరం “సిటీ విత్ బెస్ట్ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్” అవార్డు అందుకుంది. సుస్థిర నగర రవాణా విధానాలు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం చూపిన నాయకత్వాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ విజయానికి టీజీ–రెడ్కో (TGREDCO) చేసిన కృషి కీలకమైంది.


